కలం, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ యుద్ధం (Middle East War) పదో రోజుకు చేరింది. ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ అన్నట్టు భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలతో కేవలం ఆ దేశాలకు మాత్రమే ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ఆర్థిక భారం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచాన్నే నడిపిస్తున్న ఆయిల్ ఇక్కడి నుంచే మెజార్టీ పర్సెంట్ ఎగుమతి అవుతోంది. ఇప్పుడు సడెన్ గా ఆ ఎగుమతులు అన్నీ ఆగిపోయాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసి భారీ ఆయిల్ రిఫైనరీలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది.
పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు..?
యుద్ధం వల్ల గల్ఫ్, ఇరాన్ (Iran) దేశాల నుంచి చమురు ఎగుమతులు మెజార్టీ పర్సెంట్ నిలిచిపోయాయి. ఏదో కొద్దిపాటి ఎగుమతులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్లను దాటింది. చరిత్రలో ఈ స్థాయికి ఎన్నడూ బ్యారెల్ ధర చేరలేదు. యుద్ధం (Middle East War) ఇంకో వారం రోజులు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ధర 120 నుంచి 130 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొనసాగాలని చూస్తున్న ట్రంప్..?
మిడిల్ ఈస్ట్ యుద్ధం కొనసాగాలని ట్రంప్ (Donald Trump) చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ఇప్పటి దాకా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంతో ఇన్ని రోజులు యుద్ధం చేయలేదు. ఏదో ఒక ఒప్పందం లేదా చర్చలతోనే అమెరికాకు అనుకూలంగా ఆ దేశాలను మార్చేసుకునేవారు. ఇప్పుడు ఇరాన్ చర్చలకు సిద్ధం అని చెబుతున్నా సరే ట్రంప్ వద్దంటున్నారు. ఆలస్యం అయిందని ఏవేవో కారణాలు చెబుతూ.. ఇరాన్ మీద మరింత భీకరంగా దాడులు చేయిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్టు రెచ్చిపోతోంది. ఇరాన్ ను సర్వనాశనం చేయాలని చూస్తోంది. ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయినా సరే చంపేస్తామని చెబుతోంది.
ట్రంప్ ప్లాన్ అదేనా..?
న్యూక్లియర్ ట్రయల్స్ కారణంగానే ఇరాన్ మీద దాడులు చేస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు. కానీ అసలు కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఎగుమతులను దెబ్బ తీయడమే తన ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనెజువెలాను ఇప్పటికే ట్రంప్ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల్లో చమురు ఎగుమతులు ఆగిపోతే.. అది అమెరికా కంపెనీలకు ఎక్కువ బిజినెస్ జరిగేలా చేస్తుందనేది ట్రంప్ ఆలోచనగా ఇంటర్నేషనల్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ లాంటి దేశాలతో వెనెజువెలా (Venezuela) నుంచి చమురు కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు ట్రంప్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనే దేశాలకు కూడా అమెరికానే దిక్కు అని అక్కడి నుంచే ఆయిల్ కొనేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఇదే ఎక్కువ ప్రచారంలో ఉంది.
భారత్ కు నష్టం..
యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే భారత్ లాంటి దేశాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇండియా 85 శాతం ఆయిల్ ను బయటి దేశాల నుంచే కొంటోంది. అందులోనూ గల్ఫ్ దేశాలు, ఇరాన్ నుంచి దాదాపు 60 శాతం ఆయిల్ ను కొంటోంది. ఇప్పుడు అక్కడి నుంచి దిగుమతులు ఆగిపోయాయి. ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. కానీ అవి 25 రోజులకే సరిపోతాయంటోంది. ఇప్పటికే పది రోజులు అయిపోయింది. ఆ లెక్కన 15 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచుకునేలా భారత్ ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఎంత చేసినా.. గల్ఫ్ దేశాలు, ఇకాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ ను రీప్లేస్ చేయలేదు. రష్యా నుంచి చమురు కొనుకోవాలని ఇండియాకు ట్రంప్ సూచనలు చేశారు. కానీ భారత్ కు సరిపడా ఆయిల్ రష్యా నుంచి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఎటు చూసినా ఆయిల్ ధరలు ఇండియాలో పెరిగే ప్రమాదమే కనిపిస్తోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెంచేసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు రావొచ్చు.
ఆ దేశాలకు ముప్పే..?
మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భారత్ లాంటి అనేక దేశాలకు ఇది పెను ముప్పుగా మారబోతోంది. చైనా, జపాన్ తో పాటు కొన్ని దేశాలు ఇక్కడి నుంచే చమురును కొంటున్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ఈ యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తోంది. అటు ట్రంప్ కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఉండే దేశాలకు ఆర్థిక ఇబ్బందులు రావాలని అమెరికా ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. ఆ దేశాల మీద ఇప్పటికే ట్రంప్ టారిప్ ల బెడద ఉంది. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగితే.. దిగుముతి చేసుకునే దేశాల్లో ఆర్థిక సంక్షోభం కూడా రావొచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ఆ దేశాల్లో నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వస్తాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.
తగ్గని ఇరాన్.. అంతు చూస్తామంటున్న ఇజ్రాయెల్..
అయితే యుద్ధంలో ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అస్సలు తగ్గట్లేదు. ట్రంప్ రక్తం కళ్ల చూస్తామని ఇరాన్ ప్రతిజ్ఞ చేస్తోంది. ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ఇలా యుద్ధంలో పాల్గొంటున్న అన్ని దేశాలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ట్రంప్ కూడా ఇదే కావాలని చూస్తున్నారు కాబట్టి.. ఇది ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు.
Read Also: ఇరాన్‌కే మద్దతు : పుతిన్ సంచలన ప్రకటన
Follow Us On: Instagram

