కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రం వైశ్య భవన్‌లో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) ముఖ్య అతిథిగా వచ్చారు.
ఆయన్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సాదరంగా ఆహ్వానించారు. ఘనంగా పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చాగంటి వారు సనాతన ధర్మ విశిష్టతను, మానవతా విలువలను తనదైన శైలిలో చెబుతూ ప్రజలను రంజింపజేశారు.

