ఇరాన్​కే మద్దతు : పుతిన్ సంచలన ప్రకటన

కలం, వెబ్​ డెస్క్​: రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్​ పుతిన్ (Putin)​ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్​కే (Iran) తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీకి (Mojtaba Khamenei) శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రష్యా మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ సందేశం విడుదల చేశారు.

‘టెహ్రాన్ మా అచంచల మద్దతు కొనసాగుతుంది. ఇరాన్​ ప్రజలతో ఐక్యతను ధ్రువీకరిస్తున్నాను. రష్యా ఎప్పటికీ ఇరాన్​కు నమ్మకమైన భాగస్వామిగా ఉంటుంది.ప్రస్తుతం సాయుధ దాడులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ నాయకత్వానికి ఎంతో ధైర్యం, నిబద్ధత అవసరం’ అని పుతిన్​ పేర్కొన్నారు. మరోవైపు మొజ్తాబా నియామకంపై చైనా సైతం స్పందించింది. మొజ్తాబాకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే, ఆయన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇజ్రాయెల్​, అమెరికా హెచ్చరికలు చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఇరాన్​కు రష్యా (Putin), చైనా మద్దతు తెలపడంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఇరాన్​ దివంగత సుప్రీం లీడర్​ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా(56)ను ఆ దేశ అత్యున్నత నేతలు తదుపరి సుప్రీంగా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. అయితే, మొజ్తాబా ఎన్నికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ వ్యతిరేకించారు. అతని నాయకత్వాన్ని అంగీకరించబోమన్నారు. మా మద్దతు లేకపోతే మొజ్తాబా ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమేనని చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్​ అయితే ఏకంగా చంపేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇరాన్​ సుప్రీం లీడర్​గా ఎవరు బాధ్యతలు తీసుకున్నా హతం చేస్తామని పేర్కొంది.

Read Also: యుద్ధం కొనసాగాలని చూస్తున్న ట్రంప్..? ప్రపంచానికే ముప్పు..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>