Mobile Popup Ad
Mobile Popup Ad

జనసేన ఆవిర్భావ సభ రద్దు

కలం, వెబ్‌డెస్క్: మార్చి 14న నిర్వహించాల్సిన జనసేన (Jana Sena)  పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో భారీ సభ నిర్వహణను తాత్కాలికంగా విరమించుకున్నట్లు సమాచారం.

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటితో ముగియాల్సి ఉండగా, దీనిని పొడిగించే అంశంపై కూడా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల 70 వేల మంది పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన కీలకంగా తీసుకుంది. గ్రామ, పట్టణ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కువ మంది సభ్యులను నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. సభ్యత్వ నమోదును విస్తరించడమే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>