కరీంనగర్‌లో బేకరీ షాప్‌లో అగ్ని ప్రమాదం

కలం, కరీంనగర్ బ్యూరో: ​కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నేతి రవివర్మకు చెందిన ‘కేక్స్ అండ్ బేక్స్’ బేకరీ షాప్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తినష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి మరికొన్ని వివరాలు అడిగారు. మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, బేకరీ నిర్వాహకులు నేతి రవివర్మ, లోకేందర్ వంశీకృష్ణ రవి తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>