కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots Case) నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు (Sharjeel Imam) బెయిల్ లభించింది. సోదరుడి పెళ్లికి హాజరయ్యేందుకు వీలుగా 10 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్‌పై ఇమామ్ తరఫు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ కోర్టు విచారించింది. ఆరువారాల పాటు బెయిల్ ఇవ్వాలని నిందితుని తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ నెల 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
కాగా, సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో తీవ్రమైన అల్లర్లు (Delhi Riots Case) చెలరేగాయి. ఈ క్రమంలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై విచారణ జరిపిన దర్యాప్తు బృందాలు.. ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మెరాన్ హైదర్, షిఫా ఉర్ రహ్మాన్, సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లను అరెస్ట్ చేసింది. అల్లర్లు చెలరేగేలా ప్రసంగాలు చేయడంతోపాటు ప్రణాళికలు రచించినట్లు వీళ్లపై కేసులు నమోదయ్యాయి. వీళ్లలో ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్ మినహా మిగిలినవాళ్లకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. మరోవైపు ఉమర్ ఖాలీద్ విడుదలకు ఏకంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సైతం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
Read Also: ఖమ్మం వెలుగుమెట్ల బాధితుల పక్షాన ఆందోళన.. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
Follow Us On: Instagram

