ప్రధాని మోడీ పర్యటన వేళ.. కవిత బహిరంగ లేఖ!

కలం, వెబ్‌డెస్క్: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) ప్రధాని మోడీకి కీలక డిమాండ్లతో బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కవిత ఈ లేఖలో పేర్కొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించి, సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జనగణనలో బీసీ గణన ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా తెలంగాణ బీసీ బిల్లులకు అసెంబ్లీ ఆమోదించిన వెనుకబడిన తరగతుల బిల్లుల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె ఈ లేఖలో కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>