Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) కాసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రమానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానికి స్వాగతం పలికారు.

అనంతరం ప్రధాని మోదీ నేరుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) కి బయలుదేరారు. హెచ్‌ఐసీసీ నుంచి రూ.9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ పర్యటన వేళ గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>