కలం, వెబ్ డెస్క్: హిజ్బొల్లాను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా లెబననాన్ దేశంపై ఇజ్రాయెల్ (Israeal) భీకర దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో.. సామాన్య పౌరులను కూడా వదలకుండా హతమారుస్తోంది. తాజాగా, దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని పలు గ్రామాలను ఆక్రమించే లక్ష్యంతో క్షిపణి దాడులు చేయడంతో 39 మంది మరణించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ చేసిన దారుణమైన పని.. ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఉగ్రవాదుల పేరుతో సామాన్య పౌరులను కూడా ఇజ్రాయెల్ వెంటాడి చంపుతోందని ఈ ఘటన చాటి చెబుతోంది.
తండ్రీ కూతురిపై డ్రోన్ల దాడి..
దక్షిణ లెబనాన్ ప్రాంతంలో నబతి పట్టణంలో బైకుపై వెళ్తున్న తండ్రి కుమార్తెపై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడికి పాల్పడింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మరణించగా.. తప్పించుకుని పారిపోతున్న కుమార్తెను వెంటాడి మరీ ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది. దీనిపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్ సామూహిత హత్యలకు పాల్పడుతోందని.. వెంటనే ఆ దేశాన్ని అడ్డుకోకపోతే, ఇలాగే అమాయక ప్రజలను చంపుకుంటూ వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

