ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై కవిత ఫైర్.. రూ. 50 లక్షల పరిహారం డిమాండ్!

కలం, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ (Adilabad RIMS) లో చిన్నారుల మరణాలు సాధారణ ఘటనలు కావని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారని టీఆర్ఎస్ చీఫ్‌ కవిత (TRS Chief Kavitha) ఆరోపించారు. రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆమె ఆసుపత్రిని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాను ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నట్లు చెప్పారని, అలాంటి జిల్లాలో ఐదుగురు చిన్నారులు మృతి చెందితే సీఎం వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. రిమ్స్‌లో అవసరమైన స్థాయిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది లేరని ఆరోపించారు.

150 మంది వైద్యులు ఉండాల్సిన చోట సగం మంది కూడా లేరని, నర్సుల కొరత ఉందని అన్నారు. 150 ఏసీలు ఉన్న ఆసుపత్రిలో ఒక్క మెకానిక్‌ కూడా లేరని, కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. సిబ్బందిపై అధిక పనిభారం మోపుతున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రికి రూ. 500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆసుపత్రి పెండింగ్‌ బిల్లులను నెల రోజుల్లో చెల్లించాలని, ఆదివాసీ ప్రాంతాలకు రహదారులు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్‌ను ఘెరావ్‌ చేస్తామని హెచ్చరించారు. చిన్నారుల మృతికి ఆసుపత్రి సిబ్బంది లేదా రోగుల కుటుంబాలను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. గతంలోనూ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆసుపత్రిలోని పరిస్థితులపై ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని కవిత (Kavitha) డిమాండ్‌ చేశారు.

Also Read : తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>