Mobile Popup Ad
Mobile Popup Ad

సోషల్​ మీడియా రూమర్లు.. త్రిష సంచలన నిర్ణయం!

క‌లం, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్​ త్రిష (Trisha)​ మరోసారి సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. కొద్ది రోజుల వరకు తమిళనాడు సీఎం విజయ్ (Vijay)​, త్రిష ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ విజయ్​ భార్య విడాకులు కోరడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో త్రిష, విజయ్​ జంటగా ఓ పెళ్లికి అటెండ్​ అయ్యారు. విజయ్​ ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో త్రిష తిరుపతి వెళ్లడం, ఆ తర్వాత అదే రోజు విజయ్​ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విష్ చేయడం జరిగింది. ఇక వీరిద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారన్నది ఖాయమని, రేపో మాపో పెళ్లిపై అఫీషియల్​​ అనౌన్స్​ మెంట్​ వచ్చేస్తోందని అంతా భావించారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది.

సోమవారం విజయ్​ బర్త్​ డే సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్​ చెప్పారు. సోషల్​ మీడియా వేదికగా పోస్టులు చేశారు. కొందరు సెలబ్రెటీలు విజయ్​ని స్పెషల్​గా కలిశారు. అయితే నెటిజన్లు త్రిష ఎప్పుడు విషెస్​ చెప్తుందా.. ఏం పోస్ట్​ చేస్తుందా.. అని ఎదురుచూశారు. కానీ, అందరికీ షాకిస్తూ త్రిష విజయ్​ బర్త్​ డేకి సోషల్​ మీడియాలో విషెస్​ చెప్పలేదు. ఇక పర్సనల్​గా చెప్పినట్లు కూడా ఎక్కడా రివీల్​ కాలేదు. గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం త్రిష విజయ్​కి బర్త్​డే విషెస్​ చెప్తూ వస్తోంది. ఇక 2025లో అయితే ఒక స్పెషల్ ఫోటో షేర్​ చేసి హ్యాపీ బర్త్​ డే టూ ద బెస్టెస్ట్​ అని పోస్ట్​ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు విషెస్​ చెప్పలేదన్నది హాట్​ టాపిక్​గా మారింది.

ఇదే సమయంలో త్రిష విజయ్​ని సోషల్ మీడియా వేదిన ఇన్​స్టాగ్రామ్​లో అన్​ ఫాలో చేసినట్లు వార్తలు రావడం మొదలైంది. రూమర్లకు చెక్​ పెట్టేందుకే త్రిష ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రచారం నడుస్తోంది. అయితే అసలు త్రిష విజయ్​ని ఎప్పుడూ ఫాలో అవ్వలేదని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. విజయ్​ బర్త్​ డేకి త్రిష విషెస్​ చెప్పకపోవడం, ఇన్​ స్టాలో అన్​ ఫాలో వ్యవహారంపై సోషల్​ మీడియా పెద్ద చర్చే నడుస్తోంది. కొందరైతే వీరిద్దరు విడిపోయినట్లు ఉన్నారని కామెంట్​ చేస్తున్నారు. మరికొందరు వాళ్లు మంచి ఫ్రెండ్స్​ అని, రూమర్లకు చెక్​ పెట్టేందుకే త్రిష దూరంగా ఉంటోందని చెప్తున్నారు. ఏదేమైనా మరోసారి విజయ్​, త్రిష జంటగా కనిపిస్తే తప్ప ఈ చర్చకు ముగింపు పడేలా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>