Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమ ఎప్పుడూ అద్భుతమే.. విజయ్‌నుద్దేశించి త్రిష ఫస్ట్ పోస్ట్!

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటి త్రిష (Trisha), తమిళ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియా (Social Media)లో పెట్టిన తొలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన అందమైన చిత్రాలను షేర్ చేస్తూ.. ‘ప్రేమ ఎప్పుడూ అద్భుతమైనదే..’’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌‌ ఇచ్చారు. ముఖ్యంగా తాను ధరించిన ఈ దుస్తులను ఎంతో ప్రేమతో ప్రత్యేకంగా డిజైన్ చేశారని ఆమె పేర్కొన్నారు. విజయ్ రాజకీయ ప్రయాణం మొదలైన కీలక సమయంలో త్రిష ఇలాంటి పాజిటివ్ కోట్‌తో పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. అటు విజయ్ అభిమానులు, ఇటు ఆమె ఫాలోవర్లు ఈ ఫోటోలపై లైకుల వర్షం కురిపిస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరోవైపు నటి త్రిషను దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పోలుస్తూ జోరుగా వార్తలొస్తున్నాయి. త్రిష తన సినీ కెరీర్‌లో సాధించిన సుదీర్ఘ విజయం, గ్లామర్‌తో ఇండస్ట్రీలో ఆమె కొనసాగిస్తున్న ‘క్వీన్’ హోదాను చూసి నెటిజన్లు ఈ పోలిక తెస్తున్నారు. జయలలిత తరహాలోనే త్రిష కూడా తన వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన పట్టుదలను ప్రదర్శిస్తుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిష విజయ్ ప్రభుత్వంలో కీలకంగా మారుతుందా? సినిమాలకే పరిమితమవుతుందా? అనే విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>