మేము బీజేపీలోనే ఉన్నాం.. ఎమ్మెల్యే పవార్ వెంటే ఉంటాం..

కలం, బైంసా: తమను సన్మానం పేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కండువాలు కప్పించడం సరికాదని, తాము బీజేపీలోనే (BJP) కొనసాగుతున్నామని తానూర్ మండలానికి చెందిన సర్పంచులు (Tanur Sarpanches) స్పష్టం చేశారు. బుధవారం బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్​ను( MLA Pawar Rama Rao Patel) జాల (బి) సర్పంచ్ శేషరావు పటేల్, ఉపసర్పంచ్ అంకుష్ తోండాల, సర్పంచ్ మీరేకర్ మాధవ్​లు కలిసి బీజేపీ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడంతో హైదరాబాద్ వెళ్లామని, తాము బీఆర్ఎస్‌లో చేరినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తానూర్ మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సన్మానం పేరుతో బీజేపీ సర్పంచులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి మరో పార్టీ కండువాలు కప్పడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం, రాజకీయ ఆర్భాటాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీజేపీ తరఫున తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముందుకు సాగుతున్నారని, ప్రజల మద్దతు తమ నాయకుడికి ఉందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>