కలం, నిర్మల్: నిర్మల్ ఆర్టీసీ డిపో (Nirmal RTC Depot) నూతన మేనేజర్‌గా కల్పన (Kalpana Depot Manager) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన కె. పండరి హైదరాబాద్‌లోని జీడిమెట్ల డిపోకు బదిలీ అయ్యారు. జగిత్యాల డిపో మేనేజర్‌గా పనిచేసిన ఆమె నిర్మల్ డిపో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన డిపో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన కల్పనకు పలువురు ఆర్టీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

