కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి(Warkatpally) పరిధిలోని మరికొన్ని గ్రామాలతో కలిపి నూతన పీఏసీఎస్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించింది. గతంలో వర్కట్‌పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణం తక్కువగా ఉండడంతో పీఏసీఎస్‌ను ఎత్తివేయడం జరిగింది. తాజాగా వర్కట్‌పల్లి సహకార సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం లభించింది. దీంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.

