epaper
Wednesday, February 18, 2026
epaper

విషాదం.. సాగర్ ఎడమకాల్వలో పడ్డ కారు

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, దంపతులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. త్రిపురారం మండల కంపసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు డ్రైవర్‌తో కలిసి కారులో బయలుదేరారు. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి రాగానే కారు అదుపుతప్పి నాగార్జునసాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, దంపతులు తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also: బంగ్లాదేశ్​ జైలులో హిందూ లీడర్​, మాజీ ఎంపీ అనుమానాస్పద మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>