కలం, కరీంనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కరీంనగర్‌లోని (Karimnagar) స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ ఉద్యమంలో భాగంగా 1,200 మొక్కలను నాటే ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనను పాఠశాల యాజమాన్యం సన్మానించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులు, విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, కొంజర్ల మహేశ్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, సోమవారపు వెంకన్న, గాలిపల్లి నాగేశ్వర్, సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

