కలం, వెబ్ డెస్క్ : తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు లైంగిక సామర్థ్య నిర్దారణ పరీక్షలు ( పోటెన్సీ / స్పేర్మ్ టెస్ట్) నిర్వహించేందుకు రాజేంద్ర నగర్ కోర్టు ఇచ్చిన అనుమతిని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ మేరకు హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోటెన్సీ టెస్ట్ నిర్వహించొద్దని హైకోర్టును కోరారు. దీంతో పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. సోమవారం పిటిషన్ ను విచారణ చేస్తామని వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు జూలై 28న అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల కిందట ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే కస్టడీ విచారణలో పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ముఖ్యంగా ఈ కేసుకు కీలకమైన సెల్ ఫోన్ మాయం కాగా.. దాని వివరాలను అధికారులు రాబట్టలేకపోయారు. సెల్ ఫోన్ గురించి మర్చిపోయానంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం అందింది.

