ప్రాణం తీసిన పానీపూరి.. ఏడేళ్ల చిన్నారి మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: జార్ఖండ్‌ (Jharkhand)లోని గిరిడీ జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంద‌రూ ఇష్టంగా తినే పానీపూరి (Pani Puri), చాట్ తిన్న ఏడేళ్ల చిన్నా ప్రాణాలు కోల్పోయింది. అదే చోట పానీపూరి తిన్న మ‌రో 19 మంది అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ముసాఫిల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక వీధి వ్యాపారి ద‌గ్గ‌ర పానీపూరి చాట్ తిన్న వాళ్ల‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. దీంతో చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు సుమారు 20 మంది స‌ద‌ర్ ఆస్ప‌త్రిలో చేరారు. ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌ర్ పోలీసులు మాట్లాడుతూ.. బాధితులంతా ఫుడ్ పాయిజ‌న్‌కు గురైన‌ట్లు తెలిపారు. ఒక చిన్నారి మ‌ర‌ణించ‌గా మిగిలిన 19 మంది ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వెల్ల‌డించారు. స‌ద‌రు పానీపూరి వ్యాపారి ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పోలీసులు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>