కలం, వెబ్ డెస్క్: గురువారం గాంధీ భవన్‌లో టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జి నటరాజన్ మీనాక్షీ, మంత్రులు, పీఏసీ మెంబర్స్, డీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్లు హాజరుకానున్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకొనేందుకు కసరత్తులు చేయనున్నారు. అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కృష్ణ, గోదావరి జలాల పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: రేవంత్ తో చంద్రబాబు రహస్య ఒప్పందం : వైఎస్ జగన్
Follow Us On: Instagram


