epaper
Wednesday, February 18, 2026
epaper

విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డ‌మే బీజేపీ ప‌ని: టీపీసీసీ చీఫ్

క‌లం, వెబ్ డెస్క్‌: బీజేపీ భావోద్వేగాల‌తో విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంద‌ని టీపీసీసీ చీఫ్(TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆరోపించారు. బీజేపీ(BJP) జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్(Nitin Nabin) తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తున్న సంద‌ర్భంగా మ‌హేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి క‌డుతున్న ట్యాక్స్ గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల‌కు దోచిపెట్టేందుకు వ‌స్తున్నారా అని ప్ర‌శ్నించారు. బీజేపీ భావోద్వేగాల‌తో రాజ‌కీయం చేసి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింద‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు.

తెలంగాణ‌లో కూడా అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ రెచ్చగొట్టే విధానాలకు తెలంగాణ ప్రజలు లొంగర‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సెగ్మెంట్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేద‌న్నారు. త‌న‌కు తాను బీసీ అని చెప్పుకునే మోడీ బీసీల కోసం తెలంగాణ‌ చేసిన రెండు చట్టాలను గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర ఎందుకు పెండింగ్ పెట్టారో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని టీపీసీసీ చీఫ్(TPCC Chief) డిమాండ్ చేశారు.

 Read Also: సీఎం బినామీ కంపెనీకి వేల కోట్లు: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>