epaper
Wednesday, February 18, 2026
epaper

పవన్ కల్యాణ్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి : మహేష్ గౌడ్

కలం, డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీద టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ (Mahesh Goud) సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ ను దేహి అంటూ భిక్షం అడుక్కుంటున్నారని అది ఆత్మగౌరవం లేని వారు చేసే పని అంటూ మండిప్డడారు మహేష్ గౌడ్. ‘పవన్ కల్యాణ్‌ ఒక ఆంధ్రా నాయకుడు. అతను తెలంగాణ వ్యతిరేకి. ఇంతకు ముందు తెలంగాణ గురించి నీచంగా మాట్లాడిన చరిత్ర ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు ఉంది. అతను చెబితే తెలంగాణలో ఎవరూ జనసేనకు ఓటెయ్యరు. పవన్ కల్యాణ్‌ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటేనే బెటర్’ అంటూ మండిపడ్డారు మహేష్ గౌడ్ (Mahesh Goud). ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ కామెంట్లపై పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)  స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.

Read Also: విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డ‌మే బీజేపీ ప‌ని: టీపీసీసీ చీఫ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>