Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో టూరిస్టు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

కలం, డెస్క్ : ఏపీలోని కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మలమడుగు మండలం అంబవరం క్రాస్ రోడ్డు వద్ద టూరిస్టు బస్సు బోల్తా (Bus Accident) పడింది. దీంతో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరుకు చెంది 40 మంది ఆలయాల సందర్శన కోసం బస్సులో బయలుదేరారు. కన్యతీర్థం అమ్మవారిని దర్శించుకున్న వీరు.. అనంతరం మైలవరం మండలంలోని కోనకు వెళ్తుండగా.. అంబవరం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ ఊడటంతో అదుపుతప్పి ప్రమాదం (Bus Accident) జరిగింది. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>