Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకారం

కలం, డెస్క్ : ఇండియాతో టీ20 మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో (T20 World Cup) భాగంగా కొలంబోలో ఈ నెల 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను మొదట పాక్ క్రికెట్ బోర్డు (PCB) బాయ్‌కాట్ చేస్తున్నట్టు తెలిపింది. ఆ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఐసీసీ కలగజేసుకుని పాక్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్లకు ఐసీసీ (ICC) నో చెప్పింది. ఈ క్రమంలోనే నేడు పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ కలిశారు.

భారత్ తో మ్యాచ్ ఆడటంపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకారం తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న శ్రీలంకలో భారత్- పాక్ మ్యాచ్ జరగబోతోంది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ భారత్ లో ఆడేందుకు నిరాకరించడంతో.. ఆ ప్లేస్ లో స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ. దీంతో బంగ్లాదేశ్ కు మద్దతుగా పాక్ ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించి.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.

Read Also: కాంట్రాక్ట్స్ అనౌన్స్ చేసిన బీసీసీఐ.. రోహిత్, కోహ్లీలకు షాక్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>