కడ్తాల్ లో డీసీఎం బోల్తా.. ఇద్దరికి గాయాలు

కలం, సోన్ : సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై టమాటా లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీ 39 యూజే 0909 నంబర్ గల డీసీఎం వ్యాన్ టమాటా లోడుతో మహారాష్ట్ర వైపు వెళ్తోంది. కడ్తాల్ గ్రామ శివారులో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

Also Read : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు షురూ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>