ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు షురూ!

కలం, వెబ్ డెస్క్: డిసెంబర్ 7వ తేదీ నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 (Telangana Global Summit 2026) నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన భారతీయ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. కేవలం ఈమెయిల్స్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగా ఆహ్వానించేలా ప్రత్యేకంగా సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌లో ఆహారం, ఆతిథ్య ఏర్పాట్లు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంతర్జాతీయ మీడియా సంస్థలను కూడా పెద్ద సంఖ్యలో ఆహ్వానించబోతున్నారు. తద్వారా సమ్మిట్ (Global Summit 2026) విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, వృత్తిపరమైన ఏర్పాట్లు కల్పించాలని దిశానిర్దశం చేశారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో ఎలాంటి తేడాలు రావొద్దని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను శాఖల వారీగా తయారు చేసుకుని.. సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును, ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే చారిత్రాత్మక అవకాశంగా ఈ సమ్మిట్‌ను అభివర్ణించారు.

Also Read : ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>