కలం, తాంసి: తాంసి మండలం పొన్నారి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు (RS Chitru) పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వాలుకొండ జ్యోతి–కాళిదాస్ దంపతుల నూతన గృహంలో ఆదివారం రాత్రి దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, ఏఈ నశీర్, స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

