NHM సమ్మె శిబిరంలో సీఎం జన్మదిన వేడుకలు

కలం, నిర్మల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సమ్మె (NHM Employees Protest) శిబిరంలో ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. సీఎం చిత్రపటానికి వినతిపత్రం అందజేసి.. తమను రెగ్యులరైజ్ చేసి జన్మదిన కానుక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడారు.

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలందించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 27 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>