కూలిన పాఠశాల గోడ.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

కలం మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా టేక్మాల్ (Tekmal) మండలంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఎక్లాస్‌పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వర్షాల ధాటికి క్లాస్ రూమ్ బయటి వైపు గోడ కూలిపోయింది. ఆ సమయంలో పాఠశాలలో దాదాపు 35 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, గోడ క్లాస్ రూమ్ బయటి వైపు కూలడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పాఠశాలకు సెలవు ప్రకటించి, విద్యార్థులను ఇళ్లకు పంపించారు. పాఠశాల భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>