Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఏడాది చిన్నారి మృతి!

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Tirupati Accident) జరిగింది. ఉడుంవారిపల్లి సమీపంలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై లారీ – ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న ‘యస్విత’ అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

కడప డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు తిరుపతి వైపు నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అత్యంత వేగంగా బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన 30 మంది బాధితులకు రాజంపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమచారం అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>