తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15గంటలు

కలం, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala Temple) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమవారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం చేసుకోవడానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు, నిన్న 78,228 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,564 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.4.01 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 2.36 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>