కలం, వెబ్ డెస్క్: తన కెరీర్లో ‘ది ప్యారడైజ్’ మూవీ చాలా ప్రత్యేకమని, ఇలాంటిది చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని హీరో నాని (Actor Nani) అన్నారు. ప్రస్తుతం తనకు 42 ఏళ్లని.. ఇలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం అనిపించిందన్నారు. ఇప్పుడు చేయలేకపోతే.. ముందు కూడా చేయలేనన్నారు. సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ తన వద్దకు వచ్చిందన్నారు. మరో 20 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకునేలా ఈ క్యారెక్టర్ ఉంటుందన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడని ప్రశంసించారు. ప్యారడైజ్ అంటే రక్తపాతం కాదని.. తల్లీ కుమారుడు మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే చిత్రమన్నారు. కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
మోహన్ బాబుని చూసి షాకవుతారు..
మోహన్ బాబుతో పనిచేయడం చాలా గొప్పగా అనిపించిందని హీరో నాని అన్నారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇందులో ఆయన పాత్ర చూసి అంతా షాకవుతారన్నారు. ఒక రోజు ఆయన నాకు ఫోన్ చేసి.. ఈ మూవీని నా మనవరాళ్లకు ఎలా చూపించాలని నవ్వుతూ అన్నారని నాని పేర్కొన్నారు. ఇందులో ఆయన విలనిజం ఒక రేంజ్లో ఉంటుందన్నారు. ఈ చిత్రంలో తెలుగు, మలయాళ నటుల కాంబినేషన్ బాగా కుదిరిందన్నారు.

