Mobile Popup Ad
Mobile Popup Ad

ధురంధర్ మూవీపై ఏఐ పోస్ట‌ర్లు.. డైరెక్ట‌ర్ సీరియ‌స్ వార్నింగ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ధురంధ‌ర్ (Dhurandhar) సినిమా రెండో భాగం ఇటీవ‌ల విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. దీనికి దేశ వ్యాప్తంగా అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) కృతజ్ఞతలు తెలుపుతూనే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సినిమాలోని ప్రచార చిత్రాలను కొందరు ఏఐ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి, తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా హమ్జా అనే పాత్ర పగడీ ధరించి ధూమపానం చేస్తున్నట్లు ఉన్న ఒక నకిలీ ఫొటో వైరల్ అవుతోందని, అది కేవలం సమాజాన్ని రెచ్చగొట్టడానికి సృష్టించిన తప్పుడు ఫొటో ఆయన స్పష్టం చేశారు.

సిక్కు సమాజం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, సినిమాలో ప్రతి పాత్రను ఎంతో బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా తీర్చిదిద్దానని ఆదిత్య ధర్ (Aditya Dhar) పేర్కొన్నారు. అటువంటి చిత్రాలు సినిమాలో ఎక్కడా లేవని, ఇవి కావాలని చేస్తున్న కుట్రలని ఆయన వెల్లడించారు. ప్రేక్షకులు ఇలాంటి ఏఐ ఆధారిత తప్పుడు వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రచార చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇలాంటి మార్ఫింగ్ పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also: బాలకృష్ణకు లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>