కలం, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచారం (tiger sighting) తీవ్ర కలకలం రేపుతోంది. వచ్చిన దారిలోనే పెద్దపులి వెనక్కి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల మం. వీరభద్రపురం పరిసరాల్లోకి పెద్దపులి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కొనలోవ, గొండోలు, గవరయ్యపేట పరిసరాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మళ్లీ ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతానికి చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. అడ్డతీగల మండలం తిమ్మాపురం, డి.కృష్ణవరంలోనూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం జిల్లా డీఎఫ్‌వో శివకుమార్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో నిఘా కొనసాగుతోంది. హనుమాన్, ట్రాంక్విలైజింగ్ బృందాలు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.

