నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కేబినెట్ సమావేశమైంది. మరికాసేపట్లో బడ్జెట్ -2026కు ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశబెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన అధికారిక నివాసం ప్రజాభవన్ నుంచి శాసన సభకు చేరుకున్నారు. అంతకు ముందు ప్రజాభవన్‍లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో బడ్జెట్ ప్రతులకు అర్చకులు పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈసారి రూ.3.35 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. నీటిపారుదల, విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశబెట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>