న్యూజిలాండ్ గడ్డపై గుర్నూర్ బౌలింగ్ దెబ్బ!

కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్ గడ్డపై భారత పేసర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) అదరగొట్టాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డేలో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అత్యుత్తమ బౌలింగ్ (Bowling) గణాంకాల్లో రెండో స్థానంలో నిలిచాడు. 2003లో ఆక్లాండ్‌లో జవగళ్ శ్రీనాథ్ 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడం ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. గుర్నూర్ తన స్పెల్‌లో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఏడు వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు దెబ్బకు న్యూజిలాండ్ 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (55), సాంట్నర్ (31) ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ వికెట్లు వరుసగా పడ్డాయి. 112/5 నుంచి 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌటైంది. గుర్నూర్‌కు తోడు అక్షర్ పటేల్, ఔకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్ రెండేసి వికెట్లు తీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>