Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు తుంగ‌తుర్తి ఎమ్మెల్యే వార్నింగ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రొఫెసర్ నాగేశ్వర రావు ఇంటికి ఏపీ పోలీసులు రావడంపై తుంగతుర్తి (Thungathurthy) ఎమ్మెల్యే మందుల సామేలు (Mandula Samuel) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan)ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తెలంగాణపై ఆంధ్ర నాయకుల పెత్తనమేంటని సామేలు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే ఏపీ నాయకులకు వ్యతిరేకంగా మరోసారి తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.

మేధావి అయిన ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర రావు మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఏదైనా ఉంటే అమ‌రావ‌తిలో చూసుకోవాల‌ని, ఇంకా హైద‌రాబాద్‌లో మీకు ఏం ప‌ని అని ప్ర‌శ్నించారు. ఏపీ సీఎం అయిన చంద్ర‌బాబుకు ఇంకా జూబ్లీహిల్స్‌లో ఏం ప‌ని ఉంద‌ని నిల‌దీశారు. తెలంగాణ‌లోని మేధావుల‌పై ఆంధ్ర పాల‌కుల అరాచ‌కాలు ఏమిట‌ని ప్ర‌శ్నించారు. బ‌తుకుదెరువు కోసం వ‌చ్చిన వాళ్లు అలాగే ఉండాల‌ని, పెత్త‌నం చేస్తే ఊరుకునేది లేద‌ని సామేలు (Mandula Samuel) స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు హైద‌రాబాద్‌ను ఆగం చేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. దీన్ని ఇలాగే కొన‌సాగిస్తే తెలంగాణ స‌మాజం మ‌రో తిరుగుబాటుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు.

Read Also: యూసీసీ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>