Mobile Popup Ad
Mobile Popup Ad

యూసీసీ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

కలం, వెబ్ డెస్క్: దేశంలో మరో రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు మార్గం సుగుమం చేసుకుంది. అసోం (Assam) అసెంబ్లీ యూసీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్తరాఖండ్, గుజరాత్ తరువాత యూసీసీకి ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా అసోం నిలిచింది. మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే, యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం హిమంత బిశ్వ శర్మ.. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు చర్యలు చేపట్టడం గమనార్హం. గవర్నర్ అనుమతితో త్వరలోనే చట్టంగా రూపుదాల్చనుంది.

యూసీసీ అంటే ఏంటీ..?

మన దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ వంటి మతాలకు వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత అంశాల్లో వేర్వేరుగా చట్టాలున్నాయి. యూసీసీ అమలైతే.. అన్ని మతాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. దీని వలన ప్రధానంగా అన్ని వర్గాలకు సమాన న్యాయం లభించడంతో పాటు మహిళలకు హక్కులు, బాల్య విహహాలను అరికట్టడం తేలికవుతుందని ఆయా ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ బిల్లులో ప్రధానంగా, బహుభార్యత్వంపై కఠిన నిబంధనలు ఉంటాయి. విడాకుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు తావు ఉండదు. మరీ ముఖ్యంగా, ఆస్తి హక్కుల్లో మహిళలకు సమాన వాటా దక్కుతుంటుంది. వివాహం చేసుకుంటే, రిజిస్ట్రేషన్ తప్పనిసరవుతుంది.

Read Also: కూలర్ వల్ల మీ గది జిగటగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో చెక్ పెట్టండి

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>