విషాదం.. ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతి

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌ (Raipur)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మురుగునీటి ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని రామకృష్ణ ఆసుపత్రిలో మురుగునీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి ముగ్గురు కార్మికులు లోపలికి దిగారు. సుమారు 50 అడుగుల లోతు ఉన్న ఆ ట్యాంక్‌లోకి ఎటువంటి భద్రతా పరికరాలు (Safety Gear) లేకుండా వారిని పంపినట్లు సమాచారం. ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువులను పీల్చడం వల్ల ఆ ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ఊపిరాడక చనిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>