Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కలం, మెదక్ బ్యూరో: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెద్దేముల్ మండలంలోని సిద్ధన్నమడుగు తండా-తట్టపల్లి గ్రామాల మధ్య అతివేగంగా వచ్చిన లారీ ఓ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్ తన కుటుంబంతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వస్తున్న కవిరాజ్, భార్య పావని, కుమార్తె కీర్తన ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కవిరాజ్ కుమారుడు కార్తీక్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగంతో రావడంతో నియంత్రణ కోల్పోయి స్కూటీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>