Mobile Popup Ad
Mobile Popup Ad

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు భాగ్య మృతి

కలం, నేషనల్ డెస్క్: తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు భాగ్య (Maoist Bhagya) అలియాస్ రూపీ చత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. కాంకేర్ జిల్లాలో కూంబింగ్‌కు వెళ్ళిన భద్రతా దళాలకు మావోయిస్టు దళం తారసపడిందని, ఆ సమయంలో లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని ఆ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని, అందులో భాగంగా ఛోటే బెతియా, పర్తాపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని మచ్‌పల్లి అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ చర్యలు చేపట్టిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు వివరించారు.

ఘటనా స్థలంలో ఆమె మృతదేహంతో పాటు ఒక పిస్టల్, కొంత పేలుడు పదార్ధాలు, ఇతర సామాగ్రి లభించినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా చత్తీస్‌గఢ్‌ను ప్రకటించిన రెండు వారాల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య (Maoist Bhagya) అజ్ఞాతంలో ఉన్నారంటూ నాలుగు రోజుల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>