Mobile Popup Ad
Mobile Popup Ad

ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీ ఫీల్డింగ్ ఎందుకు చేయలేదంటే!

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులను ఒక విషయం కలవరపెట్టింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli), ఫీల్డింగ్ సమయంలో మాత్రం మైదానంలో కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, కోహ్లీ (50) హాఫ్ సెంచరీకి తోడు టిమ్ డేవిడ్, జితేష్ శర్మ మెరుపులు మెరిపించడంతో 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆర్సీబీ ఫీల్డింగ్‌కు వచ్చినప్పుడు కోహ్లీ స్థానంలో జాకబ్ బెథెల్ మైదానంలోకి వచ్చారు. కోహ్లీకి చీలమండ గాయం కావడంతోనే ఆయన ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ గాయం తీవ్రమైనది కాదని, తదుపరి మ్యాచ్ కల్లా ఆయన కోలుకుంటారని జట్టు వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>