నాగ‌ర్‌క‌ర్నూల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ క్రూజ‌ర్ వాహ‌నం క‌ల్వ‌ర్టును ఢీకొట్ట‌డంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శ‌నివారం తెల్ల‌వారుజామున‌ ఊర్కొండ మండలంలోని తిమ్మనపల్లి వద్ద ఈ ప్రమాదం జ‌రిగింది. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది ఉన్నారు. స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాల‌య్యాయి. స్థానికులు వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మృతుల‌ను మహాదేవి, మేఘ, రాంరెడ్డిగా గుర్తించారు. ఘ‌ట‌నలో గాయ‌ప‌డ్డ వారికి చికిత్స కొన‌సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>