పర్వతగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కలం, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి (Parvathagiri) మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బుద్ధ చరణ్‌ (16) తన బైక్ పై స్నేహితుడు కుమార్‌ణి ఎక్కించుకుని వరంగల్ నుంచి పర్వతగిరి వెళ్తున్నాడు. అదే మండలం సోమారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వడ్లకొండ ఎల్ల గౌడ్ (58) అతని స్నేహితుడు ఎండీ అహ్మద్ (58) వ్యవసాయ పనుల నిమిత్తం స్కూటీపై పర్వతగిరికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో పర్వ‌త‌గిరి మోడల్ స్కూల్ వద్ద వీరి బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బుద్ధ చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా అహ్మద్ మార్గం మధ్యలో మృతిచెందాడు. ఎల్ల గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ముగ్గురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>