కుటుంబ పోష‌ణ కోసం వ్యాపారం.. అరెస్ట్ చేసిన పోలీసులు

క‌లం, వెబ్‌డెస్క్‌: కుటుంబ పోష‌ణ కోసం వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలోని లింగంప‌ల్లి (Lingampally)లో చోటు చేసుకుంది. వ్యాపారం చేసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్ర‌శ్నించే ముందు స‌ద‌రు వ్య‌క్తి ఏం వ్యాపారం చేశాడో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌ (Bihar)కు చెందిన స‌న్నీ కుమార్ (28) కొన్నేళ్ల క్రితం త‌న కుటుంబ పోష‌ణ కోసం తీవ్ర ఇబ్బంది ప‌డేవాడు. ఈ నేప‌థ్యంలో గంజాయి స‌ర‌ఫ‌రా వైపు ఓ క‌న్నేశాడు.

స‌న్నీ కుమార్ కొన్ని రోజుల‌పాటు గంజాయి స‌ప్ల‌య‌ర్‌గా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత త‌నే నేరుగా గంజాయి కొనుగోలు చేయ‌డం, అమ్మ‌డం మొద‌లుపెట్టాడు. ఇలా పోలీసుల క‌ళ్లు గ‌ప్పి ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే సంపాదించాడు. స‌న్నీ కుమార్ విశాఖ‌ప‌ట్నం నుంచి గంజాయి కొనుగోలు చేసి బీహార్‌కు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఈ క్ర‌మంలో శ‌నివారం విశాఖ‌ప‌ట్నం నుంచి వెళ్తుండ‌గా లింగంప‌ల్లిలో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. స‌న్నీ కుమార్ ద‌గ్గ‌ర‌ రూ.7.50 లక్షల విలువైన 14.77 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>