అమెరికాలో భారీ సైబర్ దాడి.. డేటా చోరీ!

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి భారీ సైబర్ దాడి (US Cyber Attack) జరిగింది. ఎయిర్‌ఫోర్స్ క్లౌడ్ వన్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. కీలక సైనిక కంప్యూటింగ్ వ్యవస్థలనే టార్గెట్ చేసి దాడి చేశారు. సాఫ్ట్‌వేర్ లోపంతోనే హ్యాకర్లు చొరబడినట్లు గుర్తించారు. దీంతో నార్త్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ రాడార్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. హ్యాకర్లు, డేటా చోరీపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. యూఎస్ జాతీయ భద్రతపై అనుమానాలు కలిగిస్తోంది. ఏకంగా రక్షణ వ్యవస్థలోకి మాల్‌వేర్లతో చొరబడిన హ్యాకర్లు కీలక డేటాను చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా సైబర్ దాడులు చోటు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. మరో సందర్భంగా చైనా హ్యాకర్ల పని కూడా అయి ఉండొచ్చని అనుమానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>