కడ్తాల్‌లో వ్యవసాయ మోటార్ చోరీకి యత్నం

కలం, నిర్మల్: అర్ధరాత్రి వేళ వ్యవసాయ మోటార్‌ చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీకాంత్ వ్యవసాయ మోటార్‌ తన ఇంటి బయట పెట్టి నిద్రకు ఉపక్రమించారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి టీవీఎస్‌ మోపెడ్‌పై వచ్చి మోటార్‌ ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. అదే సమయంలో ఇంటి పక్కనే ఉండే ప్రణయ్ మేల్కొని దొంగను గమనించి, శ్రీకాంత్ ను అప్రమత్తం చేశాడు. వెంటనే అతడిని పట్టుకుని నిలదీశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. టీవీఎస్ మోపెడ్ సైతం స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడి వివరాలను ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>