Mobile Popup Ad
Mobile Popup Ad

అరంగేట్రం మ్యాచ్‌లోనే పాక్ కుర్రాళ్ల రికార్డు.. బంగ్లాపై జోరు

కలం, వెబ్ డెస్క్: షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ (Pakistan) కుర్రాళ్లు రికార్డుల మోత మోగించారు. రెండో రోజు ఆటలో భాగంగా పాక్ 106 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయినప్పుడు అబ్దుల్లా ఫజల్ క్రీజులోకి వచ్చారు. అజాన్ అవైస్‌తో కలిసి ఆయన ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన మూడో పాకిస్థాన్ జంటగా వీరు రికార్డుల్లోకెక్కారు. అజాన్ అవైస్ 165 బంతుల్లో 14 ఫోర్లతో 103 పరుగులు చేసి సెంచరీ సాధించగా, ఫజల్ 120 బంతుల్లో 60 పరుగులు చేసి అతనికి చక్కని సహకారం అందించారు.

అంతకుముందు 1964లో ఖలీద్ ఇబాదుల్లా, అబ్దుల్ కాదిర్ జంట 249 పరుగులతో పాక్ తరపున టాప్ రికార్డులో ఉండగా, 2003లో మహమ్మద్ హఫీజ్, యాసిర్ హమీద్ జంట కూడా ఈ ఘనత సాధించింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన కొన్ని జంటల జాబితాలో ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లు చేరారు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఇంకా 64 పరుగుల వెనుకంజలో ఉంది. సల్మాన్ అలీ ఆఘా 55 పరుగులతో క్రీజులో ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. ఇరు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>