కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మాస్, యాక్షన్ మూవీ ” ది ప్యారడైజ్”(The Paradise). ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాలీ కులకర్ణి వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్యారడైజ్ టీజర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది.
దసరా వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్లో నాని పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని మాస్ ర్యాంపేజ్ అదిరిరిపోయిందంటూ టీజర్‌కు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ” ది ప్యారడైజ్” సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్షీషు భాషలలొ 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

