థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్.. ఒక్క వీసాతో 5 ఏళ్ల పాటు చెక్-ఇన్!

కలం, వెబ్‌డెస్క్: విదేశాల్లో ఉంటూ హాయిగా పని చేసుకోవాలని ఎవరు కోరుకోరు. కానీ విదేశానికి వెళ్లడం అంటే భారీ ఖర్చు, వీసా తలనొప్పులు ఇలా చాలానే ఉంటాయని చాలా మంది భావిస్తారు. అది నిజం కూడా. కానీ అలా కోరుకునే వారికి థాయ్‌లాండ్ (Thailand) దేశం అదిరిపోయే వార్త చెప్పింది. వారి కోసం సరికొత్త వీసా (Visa) ను తీసుకొచ్చింది. అదే ‘డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా’ (DTV). కేవలం టూరిస్టుల కోసమే కాకుండా, లాంగ్ వెకేషన్ కోరుకునే వారికి, డిజిటల్ నోమాడ్స్‌కు ఇది ఒక వరంలా మారింది.

‘డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా’ స్పెషాలిటీ?

ఈ డీటీవీ వీసా తీసుకుంటే ఐదేళ్ల పాటు ఎన్ని సార్లు అయినా థాయ్‌లాండ్ వెళ్లి రావచ్చు. ఒకసారి వెళ్తే ఏకధాటిగా 180 రోజులు ఉండొచ్చు. అవసరమైతే మరో 180 రోజులు పొడిగించుకోవచ్చు. అంటే ఏడాది పొడవునా అక్కడే ఉండొచ్చన్నమాట. విదేశీ క్లయింట్లతో పనిచేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మావ్‌థాయ్ నేర్చుకోవాలన్నా, థాయ్ వంటలు నేర్చుకోవాలన్నా, వెల్‌నెస్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలన్నా ఈ వీసా ఇస్తారు. అక్కడ ఉంటూ విదేశీ కంపెనీల పని చేయొచ్చు కానీ, థాయ్ కంపెనీల్లో పని చేయాలంటే మాత్రం ప్రత్యేక వర్క్ పర్మిట్ ఉండాలి.

అర్హతలు ఇవే..

ఈ వీసా పొందాలంటే వ్యక్తి కనీసం 20 ఏళ్లు నిండాలి. మీ అకౌంట్‌లో కనీసం 5 లక్షల థాయ్ బాట్ (సుమారు ₹14 – ₹15 లక్షలు) ఉండాలి. దీనికి బ్యాంక్ స్టేట్‌మెంట్ తప్పనిసరి. క్రిప్టో లేదా క్రెడిట్ లిమిట్లను అంగీకరించరు. ఇండియా నుండి అప్లై చేస్తే దాదాపు రూ.25,000 ఖర్చవుతుంది.

దరఖాస్తు విధానం

ఈ వీసా కోసం థాయ్‌లాండ్ ఈ-వీసా పోర్టల్ లేదా మన దేశంలోని బీఎల్ఎస్ (BLS) సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్, ఫైనాన్షియల్ ప్రూఫ్స్, ఉద్యోగ ధృవీకరణ పత్రాలు ఉంటే సరిపోతుంది. వారం రోజుల్లోనే ప్రాసెసింగ్ పూర్తవుతుంది.

ఈ వీసా సేవలతో సాధారణంగా పర్యాటకులు వీసా గడువు ముగియగానే పక్క దేశాలకు వెళ్లి మళ్లీ రావాల్సిన (వీసా రన్) అవసరం లేకుండా, గౌరవప్రదంగా దీర్ఘకాలం నివసించేందుకు థాయ్‌లాండ్ ఈ చక్కని మార్గాన్ని తెరిచింది. తక్కువ జీవన వ్యయం, అద్భుతమైన ఫుడ్ కల్చర్ ఉండే థాయ్‌లాండ్‌ ఇప్పుడు భారతీయులకు మరింత దగ్గర కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>